Stuffing Bread Rolls Recipe By , 2017-11-02 Stuffing Bread Rolls Recipe Here is the process for Stuffing Bread Rolls Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఆలూ - రెండు,బ్రెడ్ స్లయిస్‌లు - ఐదు,బఠానీలు - చిన్న కప్పు,ఉప్పు - తగినంత,ఉల్లిపాయలు - ఒకటి,పచ్చిమిర్చి - మూడు,పసుపు - చిటికెడు,వెన్న- చిన్న కప్పు,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా  ఆలూని, బఠానీలని విడివిడిగా  ఉడికించుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని  గిన్నె పెట్టుకుని  అందులో కొంచెం వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి.  Step 3 తరువాత ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ గుజ్జు, ఉడికించిన బఠానీలు కూడా కలిపి, కొంచెం పసుపు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి కర్రీ చేసుకోవాలి . *ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ చివర్లు కట్ చేసి వాటి పైన తయారు చేసిన ఆలూ కర్రీని పెట్టి బ్రెడ్ స్లయిస్ కార్నర్ నుండి రోల్ లాగా చుట్టుకోవాలి .  Step 4 ఇలా  అన్నిటిని రెడీ చేసిపెట్టుకోవాలి .    Step 5 ఇప్పుడు స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి వెన్న వేసి, బ్రెడ్ రోల్స్ ఒక్కొక్కటి  వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని  తరువాత  వాటిని రౌండ్‌గా కట్ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day