aloo cheeze inlasuni masala recipe By , 2017-06-26 aloo cheeze inlasuni masala recipe Here is the process for aloo cheeze inlasuni masala making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: బంగాళాదుంపలు-2,క్రీమ్‌-2 టేబుల్‌స్పూన్లు,మొజారెల్లా చీజ్‌-3 టేబుల్‌స్పూన్లు,ఎండుమిర్చి-4,వెల్లుల్లిరెబ్బలు-4,మసాలాకోసం,వెల్లుల్లిరెబ్బలు-4,టొమాటోలు-6,పలావు ఆకు-1,గరంమసాలా- టీస్పూను,ఉప్పు- తగినంత,కారం-2 టీస్పూన్లు,గరంమసాలా- టీస్పూను,కస్తూరి మెంతి- టీస్పూను,నూనె-2 టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 ముందుగా బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి సగానికి కోయాలి. తర్వాత వాటి మధ్యలో స్పూన్‌తో కప్పులాగా రంధ్రం చేయాలి.  Step 2 తీసేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని విడిగా ఓ గిన్నెలో వేసి అందులో క్రీమ్‌, ఉప్పు, ఎండుమిర్చి ముక్కలు, చిన్నముక్కలుగా కోసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి.  Step 3 ఆ మిశ్రమాన్ని కప్పుల్లా చేసిన బంగాళాదుంపల్లో నింపాలి. తర్వాత వాటిపై చీజ్‌తురుము చల్లి అది కరిగేవరకూ కుక్కర్‌లో పెట్టి విజిల్‌ పెట్టకుండా ఉడికించాలి. మసాలా కూరకోసం Step 4 టొమాటోలను ఉడికించి పై పొరను తీసేసి చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్‌ చేయాలి.  Step 5 బాణలిలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, గరం మసాలా, పలావు ఆకులు వేసి వేయించాలి.  Step 6 అందులోనే టొమాటో ముద్ద, కారం వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి.  Step 7 ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోసి కలిపాక, స్టఫ్‌ చేసి బేక్‌ చేసిన బంగాళాదుంపలను గ్రేవీలో నెమ్మదిగా పెట్టి, వాటిమీద కసూరిమెంతి, గరంమసాలా చల్లి ఓ నిమిషం ఉడికించి తీయాలి. ఇది రోటీల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add