dates cake recipe By , 2017-10-13 dates cake recipe Here is the process for dates cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: మైదాపిండి - 2 కప్పులు,,ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు,,పంచదార - ముప్పావు కప్పు,,ఉప్పు లేని బటర్ - అర కప్పు,,నీరు - 2 కప్పులు,,కిస్‌మిస్ - పావు కప్పు,,జీడిపప్పు పలుకులు - పావుకప్పు,,వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,,బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు,,నిమ్మరసం - టేబుల్ స్పూను,,పాలు - కప్పు,,ఉప్పు - చిటికెడు, Instructions: Step 1 ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి . Step 2 మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి .  Step 3 వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి . Step 4 కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి .    Step 5 పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add