bakrid mutton biryani recipe By , 2017-09-21 bakrid mutton biryani recipe Here is the process for bakrid mutton biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ - పావు కేజీ;,బాస్మతి బియ్యం - 2 గ్లాసులు;,నీళ్లు - 3 గ్లాసులు;,పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి);,అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్;,నూనె - 2 టీ స్పూన్లు;,నెయ్యి - 2 టీ స్పూన్లు;,ఉప్పు - తగినంత;,ఉల్లిపాయ పేస్ట్ - 3 టీ స్పూన్లు;,దాల్చినచెక్క - చిన్న ముక్క;,షాజీరా - టీ స్పూన్;,ఏలకులు - 4;,పుదీనా - చిన్న కట్ట;,కొత్తిమీర - చిన్న కట్ట, Instructions: Step 1 బాస్మతి బియ్యం కడిగి సగం ఉడికిన (కొద్దిగా పలుకుగా ఉండేలా చూసుకోవాలి) తరవాత అందులోని నీటిని వంపేసి ఆ అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి.  Step 2 ఒక బాణలిలో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక షాజీరా, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 3 తరువాత పచ్చిమిర్చి , పుదీనా ఆకులు, ఉప్పు, మటన్ (కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించి పెట్టుకున్నది) వేసి బాగా వేగనిచ్చి పక్కన ఉంచుకోవాలి.  Step 4 ప్రెజర్‌పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక... ఉడికించి ఉంచిన మటన్ మిశ్రమాన్ని ఒక లేయర్‌గాను, దానిపైన అన్నాన్ని మరో లేయర్‌గా... ఇలా లేయర్లుగా పరిచి, సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add