Paneer Pudina Tandoori Cheeks By , 2017-10-28 Paneer Pudina Tandoori Cheeks Here is the process for Paneer Pudina Tandoori Cheeks making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పనీర్ - 1 కప్పు,పుదీనా - 1 కట్ట,ఉడికించిన బంగాళా దుంపలు - 1 కప్పు,ఉడికించిన కేరట్ ముక్కలు - 1/4 కప్పు,ఉల్లితరుగు - 3స్పూన్స్,సన్నగా తరిగిన బీన్స్ - 3 స్పూన్స్,సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు - 3 స్పూన్స్,షా జీరా - కొద్దిగా,ఉప్పు, నూనె - సరిపడినంత, Instructions: Step 1 ఈ తందూరీ  చీక్స్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి షా జీరా వేయాలి. Step 2 తరువాత బీన్స్ ముక్కలు, ఉల్లితరుగు,పచ్చి మిర్చి ముక్కలు  వేసి పచ్చి పోయేదాకా 2 నిమిషాలు వేయించాలి.  Step 3 పుదీనా కూడా వేసి వేయించాకా ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి కలపాలి.  Step 4 సరిపడా ఉప్పు వేసి ఆఖరుగా పనీర్ తురుము వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి దించుకోవాలి.    Step 5 ఈ మిశ్రమం చల్లారాకా గరిటెతో బాగా మెదపాలి.    Step 6 ఇలా తయారయిన ముద్దని చీక్స్(ఊచ) కి పొడుగుగా అంటించి గ్రిల్ పై పెట్టి కాల్చుకోవాలి.    Step 7 అన్ని వైపులా బాగా కాలిన తరవాత వాటిపై కాస్త పెరుగు రాయాలి.    Step 8 వీటిని పుదీనా చెట్నీ లేదా టమాటా సాస్ తో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add