Soya Matar Curry Recipe By , 2017-10-28 Soya Matar Curry Recipe Here is the process for Soya Matar Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సోయా గ్రేన్యుఅల్స్ - 1 కప్పు,గ్రీన్ పీస్ - 1 కప్పు,పాలు 1 1/2 కప్పు,తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు,టమాటో ప్యూరి - 2 స్పూన్స్,సన్నగా తరిగిన వెల్లుల్లి - 5 రెబ్బలు,సన్నగా తరిగిన అల్లం - 1 స్పూన్,పచ్చి మిర్చి - 4,కారం 1/2 స్పూన్,ధనియాల పొడి 1/2 స్పూన్,కొత్తిమీర - 1 కట్ట,నిమ్మరసం 1 స్పూన్,గరం మసాలా - 1 స్పూన్, Instructions: Step 1 సోయా గ్రేన్యుఅల్స్ ని పాలల్లో ఒక గంట సేపు నానబెట్టాలి. Step 2 అవి నానిన తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. Step 3 అవి కాస్త రంగు మారాకా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చి మిర్చి, టమాటా ప్యూరి వేసి టమాటా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. Step 4 అందులో ధనియాల పొడి కారం తగినంత ఉప్పు వేసి కాసిని నీళ్ళు పోసి అయిదు నిమిషాలు మగ్గనివ్వాలి.   Step 5 ఇందులో ఉడికించిన బఠానీలు వేసి అవి కూడా మగ్గాకా పాలల్లో నానబెట్టిన సోయా గ్రేన్యుఅల్స్ వేసి ఆ పాలు కూడా పోసి కర్రీ మొత్తం దగ్గరయ్యేదాకా ఉంచాలి.   Step 6 దించే ముందు దానిలో గరం మసాలా,  నిమ్మరసం కలిపి కొత్తిమీరతో అలంకరించుకుంటే చాలు, ఘుమఘుమలాడే సోయా మటర్ కర్రీ మీ ముందు ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day