Dal Makhani Recipe By , 2017-10-28 Dal Makhani Recipe Here is the process for Dal Makhani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పొట్టు మినప పప్పు - 1 కప్పు,రాజ్మా - 1/4 కప్పు,టమాటో ప్యూరి - 1/2 కప్పు,తరిగిన ఉల్లిముక్కలు - 1 కప్పు,వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్,ధనియాలపొడి - 1 స్పూన్,తాజా క్రీము - 2 స్పూన్స్,జీలకర్ర - 1/2 స్పూన్,ఉప్పు,కారం - తగినంత, Instructions: Step 1 తయారు చేయటానికి ముందు రోజు రాత్రి పొట్టు  మినపపప్పుని, రాజ్మా ని వేరు వేరుగా నానబెట్టుకోవాలి.  Step 2 మర్నాడు తయారుచేసే దాల్ మాఖని తయారుచేయటానికి  ముందుగా ఈ రెండిటిని కుక్కర్ లో ఉడికించాలి.  Step 3 వాటిని కాస్త మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక కడాయిలో వెన్న వేసి జీలకర్ర వెయ్యాలి.  Step 4 అది వేగాకా వెల్లుల్లి పేస్టు వేసి దానితో పాటు ఉలిముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి.    Step 5 తరువాత టమాటో ప్యూరి వెయ్యాలి. అందులో ధనియాల పొడి, కారం, ఉప్పువేసి అన్ని కలిసి 2 నిమిషాలు మగ్గాకా ఉడికించి పెట్టుకున్న మినప పప్పు, రాజ్మా ని వేసి కలిపి పది నిముషాలు దగ్గరగా రానీయాలి.    Step 6 దానిలో తాజా క్రీము కలిపి కాసేపు ఉంచి దించెయ్యాలి. ఘుమఘుమలాడే దాల్ మాఖని రోటితో కలిపి తినటానికి రెడీ అయినట్టే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day