Royyala pulusu recipe By , 2017-05-19 Royyala pulusu recipe Here is the process for Royyala pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: రొయ్యలు - 250 గ్రా.,ఉల్లిపాయలు - రెండు (పెద్దవి ),అల్లం - చిన్న ముక్క,వెల్లుల్లి - రెండు పాయలు,టమోటా - 150 గ్రా.,బంగాళాదుంప - 1 పెద్దది,పచ్చిమిరపకాయలు - 2,నూనె - 150 గ్రా.,కారం పొడి - 3 టీ స్పూన్లు,పసుపు - చిటికెడు,కరివేపాకు - 5 రెమ్మలు,కొత్తిమీర - కొంచెం,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మొదట రొయ్యలను శుభ్రం చేసుకోవాలి.  Step 2 అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి. అదే విధంగా టమోటాలు, ఉల్లిపాయ, బంగాళాదుంపను (చెక్కు తీసి) చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 3 తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు (మధ్యలో చీల్చి) వేసి వేయించుకోవాలి.  Step 4 ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.    Step 5 అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి.    Step 6 తర్వాత రొయ్యలు వేయాలి. అనంతరం చిటికెడు పసుపు వేసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.    Step 7 అలాగే టమోటా, బంగాళాదుంప ముక్కలు, కారం పొడి, ఉప్పు వేసి మరో పది నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.    Step 8 కాసేపయ్యాక కొంచెం నీళ్ళు పోసి, ఈ మిశ్రమం దగ్గరకు అయ్యేవరకు ఐదు నిముషాలు సిమ్ లో ఉడికించి దించేయాలి.           
Yummy Food Recipes
Add