mutton dosa recipe By , 2017-09-21 mutton dosa recipe Here is the process for mutton dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: దోసకాయ ముక్కలు (మీడియం సైజులో కట్‌చేసినవి) - కప్పు (చెక్కు తీసినవి),మటన్ - పావుకేజీ,ఎండుకారం - 5 టీ స్పూన్లు,నూనె - 5 టీ స్పూన్లు (తగినంత వేసుకోవచ్చు),ఉప్పు - 5 టీ స్పూన్లు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు,ఉల్లిపాయలు - 3 టీ స్పూన్లు,పసుపు - అర టీ స్పూన్,కరివేపాకు - 2 రెమ్మలు,సాజీర - అర టీ స్పూన్,ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు,మసాలా (2 ఏలకులు + 3 లవంగాలు + ధనియాలు. వేయించి, దంచి పొడి చేయాలి) - టీ స్పూన్,కొత్తిమీర - 3 టీ స్పూన్లు, Instructions: Step 1 వెడల్పాటి పాత్రలో శుభ్రపరిచిన మటన్, కారం, అల్లం- వెల్లుల్లిపేస్ట్, కొద్దిగా పసుపు కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి.  Step 2 స్టౌ పై కుక్కర్ పెట్టి నూనె వేసి, వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పక్కన కలిపి ఉంచిన మటన్ ముక్కలను కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. Step 3 తర్వాత అందులో దోసకాయ ముక్కలు, ఉప్పు, కొబ్బరి పొడి, మసాలా వేసి కుక్కర్‌మూత ఫిక్స్ చేసి, పైన వెయిట్ పెట్టాలి.  Step 4 కుక్కర్ రెండు, మూడు విజిల్స్ వచ్చాక దించి, విజిల్ పూర్తిగా రావడం ఆగిపోయాక మూత తీసి కొత్తిమీర చల్లాలి.    Step 5 అన్నం, చపాతీ, జొన్నరొట్టెల్లోకి మటన్ దోసకాయ కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day