vegetable egg omelette recipe By , 2017-09-12 vegetable egg omelette recipe Here is the process for vegetable egg omelette making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 5min Ingredients: గుడ్లు.. నాలుగు,బంగాళాదుంప.. ఒకటి,ఉల్లికాడలు.. ఒక కట్ట,టొమోటో.. ఒకటి,మిరపకాయ.. పెద్దది ఒకటి,ఉప్పు.. తగినంత,మిరియాలపొడి.. సరిపడా,నూనె లేదా వెన్న.. తగినంత, Instructions: Step 1 గుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. ఉల్లికాడ, మిరపకాయలను తరిగి ఉంచాలి. టొమోటోల్లో గింజలు లేకుండా తీసివేసి ముక్కలుగా తరగాలి.  Step 2 బంగాళాదుంప చెక్కు తీసి సన్నని పొడవు లేదా గుండ్రటి ముక్కలుగా తరిగి ఉంచాలి.  Step 3 ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్‌లో నూనె లేదా వెన్న వేసి వేడయ్యాక కూరగాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. Step 4 ముక్కలు వేగిన తరువాత వాటిమీద ఉప్పు, మిరియాలపొడి వేసి కలియబెట్టాలి.    Step 5 ఆపై గుడ్డు సొనను పోసి ముక్కలన్నింటిమీదా పరచుకునేలా చూడాలి.    Step 6 కాసేపు ఉడికిన తరువాత ఆమ్లెట్ చెదిరిపోకుండా మెల్లిగా రెండోవైపుకు తిప్పి బంగారువర్ణం వచ్చేదాకా కాల్చాలి.    Step 7 అంతే ఘుమఘమలాడే వెజిటబుల్ ఆమ్లెట్ సిద్ధమైనట్లే..!          
Yummy Food Recipes
Add
Recipe of the Day