spring onions morkolambu recipe By , 2017-09-08 spring onions morkolambu recipe Here is the process for spring onions morkolambu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉల్లికాడల తరుగు - కప్పు,,కమ్మటి గడ్డపెరుగు - రెండు కప్పులు,,శనగపప్పు - 50 గ్రా.,పచ్చికొబ్బరి తురుము - అర కప్పు,,ధనియాలు - రెండు టీ స్పూన్లు,,అల్లం - చిన్న ముక్క,,ఇంగువ - పావు టీ స్పూను,,జీలకర్ర - పావు టీ స్పూను,,కరివేపాకు - రెండు రెబ్బలు,,కొత్తిమీర - కట్ట,,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - 8,,పోపు కోసం:-,ఎండుమిర్చి - 2,,జీలకర్ర - అర టీ స్పూను,,మినప్పప్పు - టీ స్పూను,,ఆవాలు - టీ స్పూను,,మెంతులు - పావు టీ స్పూను పసుపు - చిటికెడు,,నెయ్యి - టీ స్పూను,,ఇంగువ - చిటికెడు, Instructions: Step 1 శనగపప్పును అరగంటసేపు నానబెట్టి నీరు వంపేయాలి.  Step 2 అందులో పచ్చికొబ్బరితురుము, పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిపి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.  Step 3 శుభ్రంగా కడికిన ఉల్లికాడలను మెత్తగా ఉడికించాలి. Step 4 గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, తగినంత నీరు పోసి మెత్తగా మరో పదినిముషాలు ఉడికించాలి.    Step 5 స్టౌ మీద బాణలి పెట్టి టీ స్పూను నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి దానిని ఉడికించిన మిశ్రమంలో వేయాలి.    Step 6 తరవాత స్టౌవ్ మించి దించి ఈ మొత్తాన్ని పెరుగులో వేసి చివరగా ఉప్పు వేసి బాగా కలపాలి.    Step 7 చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇది అన్నం, చపాతీ, పూరీ, దోసెలతో తీసుకోవచ్చు.    Step 8 ఇందులో పావుకప్పు కారాబూందీ కూడా పైన చల్లుకోవచ్చు.          
Yummy Food Recipes
Add