malai matar paneer recipe By , 2017-08-29 malai matar paneer recipe Here is the process for malai matar paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పనీర్‌ : 250 గ్రా.,ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు : 1/2 బౌల్‌,మీగడ : 1/2 బౌల్‌,పెరుగు : 4 టేబుల్‌ స్పూన్లు,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,ధనియాల పొడి : 1 టేబుల్‌ స్పూన్‌,ఆవాల పొడి : 1/2 టీస్పూన్‌,కారం : 1/2 టీ స్పూన్‌,పసుపు : 1/2 టీ స్పూన్‌,నీళ్ళు : 1 కప్పు,నూనె : తగినంత,గరం మసాలా పొడి: చిటికెడు,ఉప్పు : తగినంతకొత్తిమీర : అలంకరణకి, Instructions: Step 1 పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి. Step 2 బాణలిని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. Step 3 దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. Step 4 నూనె పక్కకి వచ్చిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, ఆవపొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి ఐదు నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి.   Step 5 ఇందులో మిక్సీలో వేసి పెట్టుకున్న పెరుగు పోసి ఒక నిమిషం పాటు తిప్పాలి. తర్వాత మీగడ వేసి పదార్ధాలన్నింటినీ మరొక ఐదు నిమిషాల పాటు వేయించాలి.   Step 6 తర్వాత తరిగి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు, ఉడకబెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి బాణలిపై మూత పెట్టాలి.   Step 7 ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దానిని వేరొక గిన్నెలో వేసి గరం మసాలా పొడి వేసి కొత్తి మీరతో అలంకరించాలి. మటర్‌ పనీర్‌ సర్వింగ్‌కి రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day