sesame cookies recipe By , 2017-08-05 sesame cookies recipe Here is the process for sesame cookies making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: నువ్వులు - 4 టేబుల్‌ స్పూన్లు,మైదాపిండి - 1/4 కప్పు,వెన్న -1 టేబుల్‌ స్పూన్‌,పంచదార పొడి- 1 కప్పు,ఓట్సు - 3/4 కప్పు,,బేకింగ్‌ సోడా - 1 టేబుల్‌స్పూన్‌,బాదం పొడి - 1 టేబుల్‌ స్పూన్‌ (మరీ మెత్తగా చేయకూడదు),నీళ్లు - తగినన్ని, ఉప్పు - చిటికెడు,క్యారమెల్‌ - 1 స్పూన్‌ (పంచదార ఉట్టి గిన్నెలో వేసి కొద్దిసేపు ఉంచి దింపేస్తే చాక్లెట్‌ కలర్‌ వస్తుంది.),నెయ్యి -1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 ముందు స్టవ్‌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని వెన్న వేయాలి. Step 2 అది కరిగాక పంచదార పొడి, చాక్లెట్‌ కలర్‌ వేసి బాగా తిప్పాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి.అదంతా దగ్గరగా అవుతుంది. అవసరమైతే కొద్దిగా వేడినీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. Step 3 ఉండల్ని అరచేతికి నెయ్యి రాసుకుని వేళ్లతో గుండ్రంగా ఒత్తుకోవాలి. అలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 4 వీటిని మైక్రో ఓవెన్‌లో పెట్టి సుమారు 20 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి.కేక్‌ ఓవెన్‌లో పెట్టి కూడా బేక్‌ చేసుకోవచ్చు.  Step 5 ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. గుడ్డు ఇష్టపడేవారు అది కూడా వేసుకోవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day