kothimeera rice recipe By , 2017-07-23 kothimeera rice recipe Here is the process for kothimeera rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: కొత్తిమీర - నాలుగు కట్టలు,టమాటాలు - రెండు,పచ్చిమిర్చి - నాలుగు,వెల్లుల్లి రెబ్బలు - ఐదు,సాజీరా - ఒక చెమ్చా,వండిన అన్నం - పెద్ద కప్పుతో,నూనె, ఉప్పు, పసుపు, నెయ్యి - తగినంత,వేయించిన జీడిపప్పు - 10, Instructions: Step 1 ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండి పెట్టుకోవాలి. Step 2 తర్వాత మూకుడులో రెండు చెమ్చాల నూనె వేసి చిన్న ముక్కలుగా కోసిన టమాటా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి మగ్గించాలి. Step 3 మూత పెట్టకుండా ఉంచితే నీరు పట్టదు పొడిపొడిగా వస్తుంది. మగ్గిన కొత్తిమీర, టమాటా మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక పెద్ద మూకుడులో నాలుగు చెమ్చాల నూనె, ఒక చెమ్చా నెయ్యి వేసి కాగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సాజీరా, వెల్లుల్లి వేసి, సాజీరా ఎర్రగా కాకుండానే వెంటనే మెత్తగా రుబ్బిన కొత్తిమీర మిశ్రమాన్ని వేసి వేయించాలి. Step 5 కొంచెం తడి పోగానే ఉడికించిన అన్నం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి. Step 6 దాని మీద వేయించిన జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర రైస్ వేడివేడిగా తింటే చాలా రుచిగా వుంటుంది. బూందీ, రైతా దీని కాంబినేషన్.      
Yummy Food Recipes
Add