bobbarlu vadalu recipe By , 2017-07-17 bobbarlu vadalu recipe Here is the process for bobbarlu vadalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బొబ్బర్ల - పావు కిలో,శనగపప్పు - 2 టేబుల్ స్పూన్స్,అల్లం - చిన్న ముక్క,పర్చిమిర్చి - 10,ఉల్లిపాయలు - 2 పెద్దవి,కొత్తిమీర - తరిగినది 1 కప్పు,నూనె - డీప్ ఫ్రై కి సరిపడేంత,సాల్ట్: కొద్దిగా, Instructions: Step 1 ముందుగా బొబ్బర్లను నీటిలో 10 గంటలు పాటు నాన పెట్టాలి.  Step 2 శనగపప్పు కూడా ఒక్క గంట పాటు నాన పెట్టాలి. నానిన బొబ్బర్లను నీటిలోనుండి తీసి మిక్సీలో వేసుకొని దానితో పాటు 8 పర్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క(అల్లం ముక్క ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కూడా వేసుకోవాలి.  Step 3 దీనిని ముద్దగా చేసుకోని దీనికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 4 తరువాత ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పర్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి.  Step 5 ఇప్పుడు తరిగిన కొత్తిమీరను అలాగే ఉల్లిపాయ ముక్కలను పర్చిమిర్చి ముక్కలను నానబెట్టిన శనగపప్పు కూడా మిక్సీ చేసుకున్న ముద్దలో కలపాలి. Step 6 ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో నూనె పోసి బాగా మరగనివ్వాలి. Step 7 నూనె బాగా కాగిన తరువాత మన దగ్గర ఉన్న మిశ్రమాన్ని చిన్నచిన్న వడలు మాదిరిగా చేతితో వత్తుతూ కాగిన నూనె లో వెయ్యాలి ఇప్పుడు వడలు బంగారు రంగు వచ్చే వరుకు నూనె లో వేగనివ్వాలి.  Step 8 బాగా వేగిన తరువాత తీసి ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా ఆరగించండి.  Step 9 ఇది సాయంత్రం స్నాక్ కింద తింటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడే మంచి రుచికరమైన స్నాక్ ఇది.  
Yummy Food Recipes
Add