gutti vankaya pulusu recipe By , 2017-07-17 gutti vankaya pulusu recipe Here is the process for gutti vankaya pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉల్లిపాయలు.. రెండు,పర్చిమిర్చి..నాలుగు,కరివేపాకు..కొద్దిగా,కొత్తిమీర...కొద్దిగా,అల్లం...చిన్నముక్క,వెలుల్లి...8 రేకలు,లవంగాలు...6,యాలుకలు...5,దాల్చినచెక్క..చిన్నది,గసగసాలు...ఓక్ టేబుల్ స్పూన్,జీలకర్ర...కొద్దిగా,ధనియాలు...కొద్దిగా,కారం...ఒక టేబుల్ స్పూన్,ఉప్పు ఒక టేబుల్ స్పూన్,చింతపండు... ఒక చిన్న నిమ్మకాయంత సైజ్,పసుపు...కొద్దిగా,ఆయిల్...రెండు టేబుల్ స్పూన్స్,ఎండుమిర్చి...2, Instructions: Step 1 వంకాయలను నాలుగు బాగాలుగా ముచ్చికి ఉండునట్లు కట్ చేసి వాటిని నీటిలో వేసుకోవాలి ఇలా వేయటం వలన వంకాయ రంగు మారదు.  Step 2 ఒక చిన్న నిమ్మకాయంత సైజ్ లో చింతపండును తీసుకుని ఒక చిన్నగ్లాస్ నీళ్ళు ఒక కప్ లో తీసుకుని అందులో నానపెట్టి రసం తీసి పక్కనపెట్టుకోవాలి. Step 3 తరువాత లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, గసగసాలు, జీలకర్ర ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.  Step 4 అందులో ఉల్లిపాయలని నాలుగు ముక్కలుగా చేసుకుని వీటిని , అల్లం, వెల్లులి కొంచం నీరు వేసి ముద్దగా చేసుకోవాలి.  Step 5 ఈ ముద్దలో కారం ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయల మధ్యలో ఈ ముద్దను పెట్టాలి . Step 6 తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసి, వేడి ఎక్కిన తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, పర్చిమిర్చి వేసి దానిలో కొంచం తాలింపు వేసి బాగా కలపాలి.  Step 7 ఇందులో మసాలా పెట్టిన వంకాయలు వేసి బాగా ఉడకనివాలి,బాగా ఉడికిన తర్వాత తరువాత దానిలో చింతపండు పులుసు వేసి మరి కొంత సేపు ఉడక నివ్వాలి.  Step 8 అందులో ఇష్టం ఉంటే అర చెంచా పంచదార కూడా వేసుకోవొచ్చు.  Step 9 ఇలా కొంచం సేపు ఉడకనిచ్చికొత్తిమీర వేసి దించుకోవాలి. మనకు ఎంతో ఇష్టం అయిన గుత్తి వంకాయి పులుసు రెడీ. దీనిని రైస్ లో వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనక మానరు.   
Yummy Food Recipes
Add