nethi ariselu recipe By , 2017-06-26 nethi ariselu recipe Here is the process for nethi ariselu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బియ్యం: 1కేజీ,,బెల్లం తురుము: అర కేజీ,,నువ్వులు: 100 గ్రాములు,,నీరు: ఒక కప్పు(తగినంత),యాలకులు: రెండు లేదా నాలుగు (మెత్తగా పొడిచేసుకోవాలి),నెయ్యి: 1/2కప్పు,,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి.  Step 2 పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి.  Step 3 తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం).  Step 4 పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత బియ్యంపిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి.  Step 5 ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంత వరకూ పిండి వేసి కలపాలి. 4. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టుకోవాలి. Step 6 అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని, కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి.  Step 7 బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది.  Step 8 వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపరచుకోవచ్చు. ఇవి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.  
Yummy Food Recipes
Add