green masala fish fry recipe By , 2017-06-26 green masala fish fry recipe Here is the process for green masala fish fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పచ్చి చేప ముక్కలు,,గ్రీన్‌ మసాలా పేస్ట్‌ కోసం:,పుదీనా - అర కట్ట,,కొత్తిమీర - అరకట్ట,,కరివేపాకు - రెండు రెమ్మలు,,పచ్చిమిర్చి -మూడు,,,మసాలా కోసం: ,పసుపు - అర టీ స్పూను,,గరం మసాలా - టీ స్పూన్‌,,ధనియాలపొడి - టీ స్పూన్‌,,జీలకర్ర పొడి - అర టీ స్పూను,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - టీ స్పూన్‌,,కారం - టీ స్పూన్‌,,మిరియాల పొడి - అర టీ స్పూన్‌,,ఉప్పు - రుచికి సరిపడా,,నిమ్మకాయ - ఒకటి,,ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టీ స్పూన్లు,,కార్న్‌ఫ్లోర్‌ - టేబుల్‌ స్పూన్‌,,బియ్యప్పిండి - అర టేబుల్‌ స్పూన్‌,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. వీటన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి, మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 2 చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పిండేయాలి.  Step 3 కడిగిపెట్టిన చేపముక్కల్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, కారం, మిరియాల పొడి, గ్రైండ్‌ చేసి పెట్టిన గ్రీన్‌ మసాలా పేస్ట్‌ వేయాలి. Step 4 మసాలా పొడులు, గ్రీన్‌ మసాలా పేస్ట్‌ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. రెండు టీ స్పూన్లు ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి.  Step 5 నిమ్మకాయ రసం కూడా ముక్కలకి పట్టించాలి. చివరిగా కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి వేసి కలపాలి.  Step 6 మసాలాలన్నీ కలిపిన చేప ముక్కల్ని పావుగంట నానబెడితే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది.  Step 7 మారినేట్‌ చేసిన చేపముక్కల్ని బాగా కాగిన నూనెలో మీడియం మంట మీద డీప్‌ఫ్రై చేయాలి.  Step 8 ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీరతో అలంకరించుకుంటే గ్రీన్‌ మసాలా ఫిష్‌ ఫ్రై రెడీ.!  
Yummy Food Recipes
Add
Recipe of the Day