brinjal with curd By , 2014-07-21 brinjal with curd brinjal with curd its a very tasty item..If you are in a mood to do something different with your vegetables then this is one of the perfect recipes for you... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 కప్పు వెజిటేబుల్ ఆయిల్, తగినంత ఉప్పు, అర కప్పు కొత్తిమీర తరుగు, 2 కప్పులు పెరుగు, 1 టీ స్పూన్ ధనియాలపొడి, 2 టీ స్పూన్ కారం, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపేస్ట్, 3 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ పసుపు, 8 వంకాయలు, Instructions: Step 1 ముందుగా వంకాయలను కోసుకుని అందులో నీళ్ళు, పసుపు, పంచదార, కొద్దిగ ఉప్పు వేసి కొద్దిగ ఉడికించాలి. Step 2 తర్వాత 3/4కప్పు నూనెను పాన్లో వేసి ఉడికించుకొన్న వంకాయ ముక్కలకు మీడియం మంట మీద డీఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.. Step 3 ఇప్పుడు మిగిలిన నూనెను అందులో పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ పేస్ట్ , అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేసి 5నిముషాలు ఫ్రై చేసురకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. Step 4 ఇప్పుడు అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి మరియు కొద్దిగా పసుపు వేసి, మొత్తం మిశ్రమాన్ని మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 5 తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. వేగుతున్న మసాలాలన్నీ కూడా పెరుగుతో బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. చాలా తక్కవు మంట మీద ఫ్రై చేసి 2,3నిముషాలు ఉడికించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. Step 6 తర్వాత ఒక బౌల్ లేదా డీప్ ప్లేట్ లో వంకాయలను సర్ధి తర్వాత వాటిమీద పెరుగు మిశ్రమాన్ని పోయాలి. మీ పెరుగు బ్రింజాల్ తినడానికి రెడీ . చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ.
Yummy Food Recipes
Add