kashmiri chicken recipe By , 2017-06-19 kashmiri chicken recipe Here is the process for kashmiri chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్‌ - అరకేజి,,ఉల్లి తరుగు - 2 కప్పులు,,ఎండు మిర్చి - 2,,కాశ్మీరీ కారం (మార్కెట్లో దొరుకుతుంది) - ఒకటిన్నర స్పూను,,వెల్లుల్లి - 6 రేకలు,,అల్లం - అంగుళం ముక్క,,దనియాల పొడి - 1 టీ స్పూను,,జీలకర్ర - పావు టీ స్పూను,,యాలకులు - 6,,దాల్చిన చెక్క - 2 అంగుళాలు,,జీడిపప్పు -50 గ్రా.,,బాదం - 25 గ్రా.,,పెరుగు - 100 గ్రా.,,ఉప్పు - తగినంత,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,కొత్తిమీర తరుగు - పావు కప్పు., Instructions: Step 1 చికెన్‌ ముక్కలకు ఉప్పు పట్టించి పక్కనుంచాలి.  Step 2 కారం, దనియాల పొడి, కాశ్మీరీ కారం, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు విడివిడిగా వేగించి, అన్నీ కలిపి పొడి చేయాలి.  Step 3 జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేగించి పొడి చేయాలి. నూనెలో ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగు వేగాక చికెన్‌ ముక్కలు వేసి సన్న మంటపై 5 నిమిషాలు ఉంచాలి. మసాలపొడి, ఉప్పు కలిపి మరో రెండు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. Step 4 తర్వాత జీడిపప్పు, బాదం పొడి కలపాలి. పెరుగు కలిపి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.  Step 5 ఈ కర్రీ రైస్‌, రోటీ, నాన్‌, బ్రెడ్‌తో బాగుంటుంది.  
Yummy Food Recipes
Add