carrot cucumber raita recipe By , 2017-06-15 carrot cucumber raita recipe Here is the process for carrot cucumber raita making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: క్యారెట్‌ తురుము - అర కప్పు,,కీరదోసకాయ - అరకప్పు(తురుము లేదా ముక్కలు),,పెరుగు - 2 కప్పులు,,పచ్చిమిర్చి - 4,,శనగపప్పు - 1 టీ స్పూను,,మినప్పప్పు - 1 టీ స్పూన,,ఆవాలు - 1 టీ స్పూన,,జీలకర్ర - అర టీ స్పూన,,ఎండుమిర్చి - 6,,కరివేపాకు - రెండు రెమ్మలు,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,ధనియాలపొడి - అర టీ స్పూన,,,జీలకర్ర పొడి - అర టీ స్పూన,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా పానలో నూనె వేసి కాగాక క్యారె ట్‌ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి. Step 2 తర్వాత గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు కొద్దిగా నీళ్ళు వేసి గిలక్కొట్టాలి.  Step 3 ఇప్పుడు మరో డీప్‌ ఫ్రైయింగ్‌ పానలో నూనె వేసి కాగాక అందులో ఎండు మిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి.  Step 4 చిలికిన పెరుగులో వేయించి ఉంచుకున్న క్యారెట్‌ తురుము వేసి కలపాలి.    Step 5 వేయించి ఉంచుకున్న పోపు కూడా జోడించాలి. ఇప్పుడు కీరదోసకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.    Step 6 అంతే క్యారెట్‌ రైతా రెడీ. ఇది అన్నంలోకి, రోటీలలోకి బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day