tomato chicken manchuria recipe By , 2017-06-14 tomato chicken manchuria recipe Here is the process for tomato chicken manchuria making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ,,ఉల్లిపాయలు - 2,,క్యాప్సికం - 1,,టమోటా - 1,,అల్లం - అంగుళం ముక్క,,వెల్లుల్లి - 6 రేకలు,,సోయా సాస్‌ - 1 టేబుల్‌ స్పూను,,పచ్చిమిర్చి - 2,,వెనిగర్‌ - 1 టేబుల్‌ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,పంచదార - 1 టీ స్పూను,,అజీనమోటో - 1 టీ స్పూను,,కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను.,,జారు కోసం: ,మైదా - అరకప్పు,,కార్న్‌ ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను,,మిరియాల పొడి - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,సోయా సాస్‌ - 1 టీ స్పూను., Instructions: Step 1 చికెన్‌ అంగుళం ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడి, సోయాసాస్‌, ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలపాలి. Step 2 చికెన్‌ ముక్కల్ని ఆ జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. Step 3 కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.  Step 4 తర్వాత టమోటా తరుగు, ఉప్పు, పంచదార, అజీనమోటో, క్యాప్సికం ముక్కలు కలపాలి.    Step 5 రెండు నిమిషాల తర్వాత సోయా సాస్‌, వెనిగర్‌ కలిపి కప్పు నీరు పోసి ఉడికించాలి.    Step 6 క్యాప్సికం సగం ఉడికిన తర్వాత (నీటిలో కరిగించిన) కార్న్‌ ఫ్లోర్‌ వేసి చిక్కబడేవరకు ఉంచాలి.   Step 7 ఇప్పుడు వేగించిన చికెన్‌ వేసి గ్రేవీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. 3 నిమిషాల తర్వాత సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని ఉల్లికాడలతో అలంకరించాలి          
Yummy Food Recipes
Add
Recipe of the Day