Coconut Samosa recipe By , 2017-06-05 Coconut Samosa recipe Here is the process for Coconut Samosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి) : 1 కప్పు,కొబ్బరి కాయ : ఒకటి,పంచదార : మూడు కప్పులు,మిల్క్ మెయిడ్ : 1 కప్పు,యాలుకలపొడి : టీ స్పూన్,మైదా : పావు కిలో,నెయ్యి : కప్పు,నూనె : పావుకిలో, Instructions: Step 1 మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి. Step 2 ఇప్పుడు కొబ్బరి కోరుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి. Step 3 పాకంలో కొబ్బరికోరు వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకలపొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి.  Step 4 ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి  దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి.   Step 5 అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి.   Step 6 ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారు చేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తియ్యాలి.   Step 7 ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసి ప్లేటులో పెట్టాలి. అంతే కొబ్బరి స్వీట్ సమోసా రెడి.          
Yummy Food Recipes
Add