Usiri pulihora recipe By , 2017-05-17 Usiri pulihora recipe Here is the process for Usiri pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఉసిరికాయ ముక్కలు - ఒక కప్పు,,కొబ్బరి తురుము - అర కప్పు,,పచ్చిమిరపకాయలు - 5,,బియ్యం - రెండు కప్పులు,,జీడిపప్పు - 10,,పల్లీలు - 2 టీ స్పూన్స్,,మినపప్పు - అర టీ స్పూన్,,జీలకర్ర - ఒక టీ స్పూన్,,ఆవాలు - అర టీ స్పూన్,,ఎండు మిరపకాయలు - 3,,పసుపు - కొద్దిగా,,కరివేపాకు - 2 రెమ్మలు ,,కొత్తిమీర - అర కట్ట,,నిమ్మరసం - 2 టీ స్పూన్స్,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ఉసిరికాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి. Step 2 ఇలా చేసేప్పుడు నీళ్ళు మాత్రం పోయకూడదు. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 అన్నాన్ని వండి పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి జీడిపప్పు, పల్లీలు, మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. Step 4 ఇవి వేగాక కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఉసిరికాయ పొడి వేసి కలపాలి.   Step 5 కాసేపటి తర్వాత ఉప్పు వేయాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు ముందే వండేసిన అన్నాన్ని వేసి కలపాలి.   Step 6 చివరగా నిమ్మరసం పోసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.               
Yummy Food Recipes
Add