tomato pulao recipe By , 2017-05-17 tomato pulao recipe Here is the process for tomato pulao making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 15min Ingredients: సన్నబియ్యం - 250 గ్రా;,టొమాటోలు - 100 గ్రా;,ఉల్లిపాయ - 1;,పుదీనా ఆకులు - 1/4 కప్పు;,పచ్చిమిర్చి - 4;,అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్;,నూనె - 2 టేబుల్ స్పూన్లు;,నెయ్యి లేదా డాల్డా - టేబుల్ స్పూన్;,ఏలకులు - 3;,లవంగాలు - 5;,దాల్చినచెక్క - చిన్నముక్క;,షాజీరా- 1/2 టీ స్పూన్;,ఉప్పు - తగినంత., Instructions: Step 1 బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. Step 2 టొమాటోలు చిన్న ముక్కలుగా తరిగి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేయాలి. Step 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి మెత్తబడ్డాక పుదీనా ఆకులు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి.   Step 5 టొమాటో ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి.   Step 6 అంటే పాత బియ్యమైతే గ్లాసుతో బియ్యం కొలుచుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి.    Step 7 అప్పుడు అన్నం పూర్తిగా ఉడికి మెత్తగా కాకుండా ఉంటుంది.    Step 8 కొత్త బియ్యమైతే నీళ్లు తగ్గించాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి.   Step 9 టమాట నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి.   Step 10 అన్నం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి.   Step 11 ఈ పులావ్‌ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో, ప్రయాణాలలో పులిహోరకు బదులుగా చేసుకుని తీసుకెళ్లొచ్చు. కుర్మా లాంటి కూర లేదా పెరుగుపచ్చడితో సర్వ్ చేయాలి.   
Yummy Food Recipes
Add