baby corn senagala rice recipe By , 2017-05-17 baby corn senagala rice recipe Here is the process for baby corn senagala rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉడికించిన అన్నం - రెండు కప్పులు,,ఉడికించిన శెనగలు - పావు కప్పు,,బేబీకార్న్ - ఆరు (నిలువుగా చీల్చి నాలుగు ముక్కలుగా కోయాలి),,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - రెండు టేబుల్ స్పూన్లు., ,మసాలా కోసం:,శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్,,ఎండుమిర్చి - ఐదు,,ధనియాలు - అర టేబుల్ స్పూన్,,మిరియాలు - అర టీస్పూన్,,జీలకర్ర - అర టీస్పూన్,,నువ్వులు - ఒక టీస్పూన్., Instructions: Step 1 శెనగల్ని ఒక రాత్రంతా లేదా వేడి నీళ్లలో ఒక గంట నానపెట్టాలి. కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. Step 2 బేబీకార్న్ను శుభ్రంగా కడిగి నిలువుగా చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్లలో ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి. Step 3 అన్నం పలుకుగా ఉడికించి వెడల్పాటి పళ్లానికి నూనె పూసి అందులో పరవాలి. పాన్ను వేడిచేసి మసాలా దినుసుల్ని వేగించి చల్లారాక పొడి కొట్టాలి.  Step 4 నాన్ స్టిక్ కళాయిలో నూనె వేడిచేసి ఉడికించిన శెనగలు, బేబీకార్న్ వేసి మూడు నిమిషాల పాటు వేగించాలి.    Step 5 తరువాత ఇందులో మసాలా పొడి వేసి కలపాలి. ఉడికించిన అన్నాన్ని వేసి గరిటెతో కలిపి అవసరమనుకుంటే ఉప్పు వేయాలి.   Step 6 అన్నం మీద కొన్ని నీళ్లు చల్లి మరో ఐదు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచాలి.    Step 7 కొత్తిమీర తరుగు వేసి, ఆ పైన క్యారెట్ తురుము కూడా చల్లుకుంటే బాగుంటుంది. ఈ అన్నాన్ని కీరదోసకాయ రైతాతో తింటే వారెవ్వా అనాల్సిందే.                
Yummy Food Recipes
Add
Recipe of the Day