Veg dum biryani recipe By , 2017-05-17 Veg dum biryani recipe Here is the process for Veg dum biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బాస్మతి బియ్యం - 4 కప్పులు,కూరగాయలు - 1 కప్పు,ఉల్లిపాయ - 1,పచ్చిమిర్చి - 3,పసుపు - 1/2 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,గరం మాసాలా పొడి - 1 టీ.స్పూ.,పెరుగు - 1 కప్పు,నిమ్మరసం - 3 టీ.స్పూ.,పుదీనా, కొత్తిమీర - 1/4 కప్పు,అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - 3 టీ.స్పూ.,నెయ్యి - 2 టీ.స్పూ.,లవంగాలు - 6,యాలకులు - 4,దాల్చిన చెక్క - 1 అంగుళం,ముక్క,షాజీర - 1 టీ.స్పూ., Instructions: Step 1 బాస్మతి బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి.  Step 2 ఒక గిన్నెలో ఎనిమిది గ్లాసుల నీళ్లలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బియ్యానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.  Step 3 నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం తీసి వేయాలి. మంట తగ్గించి బియ్యం ముప్పావు వంతు ఉడకగానే జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి.  Step 4 బిర్యానీ చేయడానికి మందంగా ఉండే గిన్నె లేదా పాన్ తీసుకోవాలి. కుక్కర్ పాన్ ఐతే ఇంకా మంచిది.   Step 5 ఈ గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేపి పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద (ఇష్టమైతే) కారం పొడి వేసి మరికొద్దిసేపు వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయలు వేసి కలిపి మూత పెట్టాలి.   Step 6 ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత అన్నం వేసి దానిపైన నెయ్యి, కొద్దిగా పాలువేసి మూతపెట్టాలి.    Step 7 దానిపైన బరువు ఏదైనా పెట్టి చిన్న మంటమీద మరో పది నిమిషాలు ఆవిరికి మగ్గనివ్వాలి. తర్వాత వేడిగా సర్వ్ చేయాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day