beans Meal maker curry recipe By , 2017-05-11 beans Meal maker curry recipe Here is the process for beans Meal maker curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీన్స్ - 200 గ్రా.,మీల్‌మేకర్ - 50 గ్రా.,జీలకర్ర - 1 టీ.స్పూ.,పసుపు - 1/4 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,పంచదార -1/2 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,ఎండుమిర్చి - 2,ఉల్లిపాయ - 1 చిన్నది,వెల్లుల్లి - 4 రెబ్బలు,కరివేపాకు - 2 రెబ్బలు,నూనె - 2 టీ.స్పూ., Instructions: Step 1 ఒక గినె్నలో మూడు గ్లాసుల నీళ్లు మరిగించి మీల్ మేకర్ వేసి దింపేయాలి.  Step 2 చల్లారిన తర్వాత నీరంతా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. బీన్స్ నార తీసి ఒకటి లేదా రెండు అంగుళాల సైజులో కట్ చేసుకోవాలి. Step 3 పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.  Step 4 ఇందులో నలక్కొట్టి సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం పొడి వేసి కలిపి మీల్‌మేకర్ వేయాలి.   Step 5 వీటిని కొద్దిసేపు వేయించాక బీన్స్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బీన్స్ ముందే సగం ఉడికించి పెట్టుకోవచ్చు.   Step 6 బీన్స్ వేగిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి.   Step 7 నీరు పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత దింపేయాలి. ఇష్టముంటే టమాటాలు, కొబ్బరిపొడి వేసి కుర్మాలా కూడా చేసుకోవచ్చు.            
Yummy Food Recipes
Add
Recipe of the Day