Methi tomato curry recipe By , 2017-01-27 Methi tomato curry recipe Here is the process for Methi tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టొమోటోలు 1/4 కేజీ,మెంతికూర 1 కప్పు,కొబ్బరికోరు 1 టీస్పూన్,ఉల్లిపాయ 1,కారం 1 టీస్పూన్,ఉప్పు తగినంత,అల్లం, వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్,నూనె 1 టీస్పూన్,ధనియాలపొడి 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర తగినంత,జీలకర్ర,ఆవాలు 1 టీస్పూన్, Instructions: Step 1 బాణెలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. Step 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. Step 3 అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి. Step 4 శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి. Step 5 తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి. Step 6 అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి. Step 7 ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి, చివర్న కొత్తిమీర చల్లుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day