Kanda Ulli poraka recipe By , 2017-05-10 Kanda Ulli poraka recipe Here is the process for Kanda Ulli poraka making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: కంద - 250 గ్రా.,ఉల్లిపొరక - 500గ్రా.,ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.,పసుపు - 1/4 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 టీస్పూ.,ధనియాల పొడి - 1 టీ.స్పూ.,గరం మసాలా పొడి 1/4 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - 3 టీ.స్పూ., Instructions: Step 1 కందదుంపపై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 ఉల్లిపొరక కూడా శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి.  Step 3 ఇందులో తెల్లని ఉల్లి భాగం విడిగా పెట్టుకోవాలి.పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేపాలి. Step 4 ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్దిగా వేపి కంద ముక్కలు వేయాలి.    Step 5 రెండు నిమిషాలు వేగిన తర్వాత కడిగిన ఉల్లిపొరక తరుగు వేసి కలిపి మూత పెట్టాలి.   Step 6 కొద్దిగా మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.   Step 7 కూర ఉడికిన తర్వాత గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీలకు బావుంటుంది.             
Yummy Food Recipes
Add