mirchi ka salan By , 2017-05-10 mirchi ka salan Here is the process for mirchi ka salan making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మిరపకాయలు – 250 గ్రాములు,చింతపండు పులుసు – 1/4 కప్పు,పసుపు – 1/4 టీస్పూన్,కారం పొడి – 1 టీస్పూన్,ఉప్పు – తగినంత,కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్,జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్,మెంతి పొడి – 1/4 టీస్పూన్,పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్,నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్,ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్,అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్,జీలకర్ర – 1/4 టీస్పూన్,గరం మసాలా పొడి – 1 టీస్పూన్,మెంతులు – చిటికెడు,నూనె – 4 టేబుల్ స్పూన్స్, Instructions: Step 1 ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. Step 2 రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి.  Step 3 ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది. Step 4 ప్యాన్‌లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి.    Step 5 ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి, నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి.   Step 6 ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి.   Step 7 పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరం మసాలా పొడి వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి. కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన్ తయారైంది. ఈజీగా ఉంది కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా బావుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day