Aloo Amritsari recipe By , 2017-05-08 Aloo Amritsari recipe Here is the process for Aloo Amritsari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళాదుంపలు - నాలుగు,శెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్‌స్పూన్,పచ్చిమిర్చి - మూడు (సన్నగా తరగాలి),ఉల్లిపాయలు - రెండు (తరగాలి),టొమాటోలు - మూడు (సన్న ముక్కలుగా తరగాలి),జీలకర్ర, కారం, అనార్ దానా పొడి (ఎండపెట్టిన దానిమ్మగింజల పొడి) - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున,పసుపు - కొద్దిగా,ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్,గరం మసాలా పొడి - ఒక టీస్పూన్,వాము, బేకింగ్‌సోడా - ఒక్కోటి చిటికెడు చొప్పున,ఆమ్‌చూర్ పొడి - పావు టీస్పూన్,నెయ్యి - ఒకటేబుల్ స్పూన్,నూనె - సరిపడా,ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 బంగాళాదుంపల పొట్టు తీసి పొడవైన ముక్కలుగా కోసుకోవాలి. Step 2 శెనగపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వాము, దానిమ్మ గింజల పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, బేకింగ్ సోడా, అర టీస్పూన్ నెయ్యిలను ఒక గిన్నెలో వేసుకోవాలి. Step 3 నెమ్మది నెమ్మదిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలుపుకోవాలి. Step 4 ఇందులో బంగాళా దుంపల ముక్కల్ని వేసి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.   Step 5 పెద్ద గిన్నెలో వేగించడానికి సరిపడా నూనె పోసి నానిన బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేగించాలి.   Step 6 నూనె పీల్చుకునే పేపర్ మీద వాటిని వేయాలి.    Step 7 ఆ తరువాత మిగిలిన నెయ్యిని ఒక నాన్‌స్టిక్ పాన్‌లో వేసుకుని అందులో ఉల్లిపాయ తరుగు వేసి మెత్తగా అయ్యే వరకు వేగించాలి.    Step 8 తరువాత పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు మిగిలిన పదార్ధాలన్నింటినీ వేసి కలిపి పాన్ మీద మూతపెట్టి ఏడు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించాలి.    Step 9 గ్రేవీ చిక్క బడిన తరువాత వేగించిన బంగాళాదుంప ముక్కల్ని వేసి కలియపెట్టాలి. మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి అలంకరించాలి.          
Yummy Food Recipes
Add