Nargis kebab recipe By , 2017-04-20 Nargis kebab recipe Here is the process for Nargis kebab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మీల్‌మేకర్ - పావు కేజీ,,శనగపప్పు - సగం కప్పు,,ఉడికించిన కోడిగుడ్లు - నాలుగు,,అల్లం పేస్ట్ - 1,పూదీనఆకులు - గుప్పెడు,,దాల్చిన చెక్క - కొద్దిగా,,లవంగాలు - నాలుగు,,యాలకులు - 2,,జీలకర్ర - 1/2 స్పూన్,,సోంపు - 1/2 స్పూన్,,కారం - రెండు,నల్లమిరియాల పొడి - ఒక స్పూన్,గరం మసాలా - ఒక స్పూన్,పసుపు - 1/2 స్పూన్,,ఒక గుడ్డు అదనంగా,,ఉప్పు - తగినంత,,నూనె- డీప్ ఫ్రైకి సరిపడ, Instructions: Step 1 ఒక పాన్‌లో మూడునాలుగు కప్పుల నీళ్లు పోసి, ఇందులో దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేసి బాగా ఉండికించాలి. Step 2 కొద్దిసేపాగి మీల్‌మేకర్ వేసి ఎక్కువ మంటమీద 2 నుంచి మూడు నిమిషాలపాటు ఉడికించాలి.  Step 3 దింపేసి మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాలపాటు పక్కన పెట్టి చూస్తే మీల్‌మేకర్ సైజు డబుల్ అవుతుంది. Step 4 ఇప్పుడు అందులోని నీటిని వంపి మీల్‌మేకర్ చేతిలోకి తీసుకుని నీళ్లు పోయేలా పిండి పక్కన పెట్టుకోవాలి.   Step 5 మరో గిన్నె తీసుకుని అందులో శనగపప్పు మృదువుగా అయ్యేంతవరకు ఉడికించాలి. తరువాత నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.   Step 6 ఇప్పుడు పక్కకు పెట్టిన మీల్‌మేకర్‌లో ఉడికించిన శనగపప్పు, పూదీన ఆకులు, అల్లం పేస్ట్, సోంపు, జీలకర్ర, పసుపు, కారం, నల్లమిరియాల పొడి, గరంమసాలా పొడి, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టాలి.    Step 7 నీళ్లు అస్సలు పోయకూడదు. అదనంగా తీసుకున్న కోడిగడ్డును పగులకొట్టి సొన వేసి మళ్లీ మిక్సీ పట్టాలి.   Step 8 ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించిన కోడిగుడ్డు చుట్టూ ఫొటోలో చూపినవిధంగా పెట్టాలి.   Step 9 తరువాత ఒకటినుంచి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టి తీశాక, ఒక గిన్నెలో నూనె పోసి బాగా వేడిచేయాలి.   Step 10 మిశ్రమం దట్టించిన ఒక్కో కోడిగుడ్డును తీసుకుని నూనెలో వేయించాలి. నిమ్మ ముక్కలతో ఈ కబాబ్స్ సర్వ్ చేస్తే సూపర్!            
Yummy Food Recipes
Add