Chicken pulav recipe By , 2017-03-20 Chicken pulav recipe Here is the process for Chicken pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడి మాంసం -1/2 కేజీ ,,ఉప్పు -1 టీస్పూన్ ,,పసుపు -1/4 టీస్పూన్ ,,కారం -1టీస్పూన్,,బిరియాని మసాలా పొడి /గరం మసాలా పొడి -1 టీస్పూన్,,యాలకలు -2,,లవంగాలు -3,,చెక్క -అరంగుళం ,,జీలకర్ర -1/4 టీస్పూన్,,జాజిపువ్వు -1,,జవిత్రి -1,,అనాసపువ్వు -2,,బిరియాని ఆకు (బే లీఫ్ )- 1,,పచ్చిమిర్చి -2,,పుదీనా -2 రెమ్మలు ,,కొత్తిమీర -2 రెమ్మలు ,,నిమ్మ రసం - 1 టీస్పూన్,,పెరుగు - 4 టేబుల్ స్పూన్లు ,,బియ్యం (బాస్మతి బియ్యం అయినా వాడవచ్చు) -1.1/2 గ్లాసు(300 ml),ఉల్లిపాయ -1,,నెయ్యి /నూనె -2 టేబుల్ స్పూన్లు., Instructions: Step 1 ముందుగా కోడి మాంసాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి.   Step 2 ఒక గిన్నె తీసుకుని అందులో కోడి మాంసం ,ఉప్పు ,పసుపు ,కారం ,బిరియాని మసాలా పొడి /గరం మసాలా పొడి, యాలకలు, లవంగాలు, చెక్క ,జీలకర్ర ,జాజిపువ్వు, జవిత్రి , అనాసపువ్వు, బిరియాని ఆకు (బే లీఫ్ ), పచ్చిమిర్చి, పుదీనా,నిమ్మరసం, కొత్తిమీర మరియు పెరుగు వేసి బాగా కలపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. Step 3 కుక్కర్ లో నెయ్యి /నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి. నూనె /నెయ్యి వేడి ఎక్కిన తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపుకోవాలి.  Step 4 తర్వాత మ్యారినేట్ చేసిన కోడి మాంసాన్ని మరియు నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. 1.1/2 గ్లాస్సుల బియ్యానికి 2.1/4 గ్లాసుల నీళ్లు పోసి ఒకసారి ఆ నీటిని రుచి చూసి ఉప్పు మరియు కారం సరిపోయిందో లేదో చూసుకుని, కుక్కర్ మూత పెట్టి 2 లేక 3 విస్టల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.  Step 5 కుక్కర్ లేనివారు రైస్ కుక్కర్ లో ఉడికించుకోవచ్చు. అంతే గుమగుమలాడే కోడి పలావ్ రెడీ.     
Yummy Food Recipes
Add