kadai Chole recipe By , 2017-05-08 kadai Chole recipe Here is the process for kadai Chole making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కాబూలీ శనగలు - 250 గ్రా.,ఉల్లి తరుగు - 50 గ్రా.,టొమాటో తరుగు - 75 గ్రా,పచ్చిమిర్చి - 4,అల్లం వెల్లుల్లి పేస్ట్ - అరటీస్పూన్,పుదీనా తరుగు - అరకప్పు,కొత్తిమీర తరుగు - కొద్దిగా,బిరియానీ ఆకులు - మూడు,పసుపు - చిటికెడు,నూనె - 25 గ్రా.,మిరప్పొడి - అరటీస్పూన్,చోలే మసాలా - అరటీస్పూన్,ఆమ్ చోర్ పౌడర్ - అరటీస్పూన్,గరం మసాలా - పావుటీస్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్ లో సుమారు అరగంట సేపు ఉడికించాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాగాక, బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. Step 3 అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు కూడా ఒక్కదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 ఉడికించిన శనగలో పావుకప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి.   Step 5 మూడు లేక నాలుగు నిమిషాల తర్వాత నీరు లేకుండా శనగలు పై మిశ్రమంలో వేసి, రుచికి తగ్గట్టు ఉప్పు కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి.   Step 6 తర్వాత ఒక కడాయిలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించాలి.               
Yummy Food Recipes
Add