Kofta Curry recipe By , 2017-05-06 Kofta Curry recipe Here is the process for Kofta Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సొరకాయ - పావుకేజీ,మొక్కజొన్న పిండి - మూడు టేబుల్ స్పూన్లు,బ్రెడ్ స్లైసులు - మూడు,ఉల్లిపాయలు - మూడు,టొమాటోలు - రెండు,అల్లం - చిన్న ముక్క,వెల్లుల్లి రెబ్బలు - ఐదారు,జీడిపప్పు - ఎనిమిది,వెన్న - అరకప్పు,పసుపు - అరచెంచ,ఉప్పు - తగినంత,కారం - రెండు చెంచాలు,ధనియాల పొడి - రెండు చెంచాలు,నూనె - వేయించడానికి సరిపడా,జీలకర్ర - కొద్దిగా,కొత్తిమీర తరుగు - పావుకప్పు, Instructions: Step 1 సొరకాయ చెక్కు తీసి తురుమి గట్టిగా పిండేస్తే అందులోని నీరు పోతుంది.  Step 2 అందులో మొక్కజొన్న పిండి, బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు, చెంచ కారం, సగం కొత్తిమీర తరుగు వేసుకొని గట్టి పిండిలా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని ఉండల్లా చేసుకొని అందులో వేసి ఎర్రగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి. Step 4 ఉల్లిపాయ, టొమాటోలను ముక్కల్లా కోసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.   Step 5 ఈ మిశ్రమాన్ని ఐదారు చెంచాల నూనెలో వేసి బాగా ఉడకనివ్వాలి.    Step 6 కాసేపయ్యాక మిగిలిన కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర తరుగు, మరికొంచెం ఉప్పు, వెన్న వేసి బాగా కలపాలి.    Step 7 ఒకవేళ గ్రేవీ మరీ గట్టిగా ఉందనుకుంటే కాసిని నీళ్ళు కలుపుకోవచ్చు.   Step 8 ఐదారు నిమిషాలయ్యాక దీన్ని దింపేసి ముందుగా వేయించుకున్న ఉండాలని వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రైడ్ రైస్ లోకి, రొట్టేల్లోకి బాగుంటుంది.          
Yummy Food Recipes
Add