Capsicum paneer korma recipe By , 2017-05-06 Capsicum paneer korma recipe Here is the process for Capsicum paneer korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: క్యాప్సికం - 400 గ్రా.,పన్నీర్ - 50 గ్రా.,తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు,ఉల్లిపాయలు - 4 (పెద్దవి),అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీస్పూన్లు,పసుపు - 3 చిటికెలు,చింతపండు - నిమ్మకాయంత ఉండ,లవంగాలు - 3,యాలకులు - 3,దాల్చిన చెక్క - కొంచెం,సోంపు - అరటీస్పూన్,జీలకర్ర - టీస్పూన్,కొత్తిమీర - కొంచెం,పుదీనా - కొంచెం,కరివేపాకు - కొంచెం,కారం - రెండున్నర టేబుల్ స్పూన్లు,ధనియాల పొడి - 2 టీస్పూన్లు,నూనె - 200 గ్రా.,ఉప్పు - రుచికి సరిపడా,వేరుసెనగ పప్పు - కప్పు, Instructions: Step 1 మొదట క్యాప్సికం, ఉల్లిపాయలు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. Step 2 బాణలిలో తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు వేసి నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 తర్వాత అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్ ను విడివిడిగా వేయించుకోవాలి.  Step 4 ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.    Step 5 బాణలిలో నూనె వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.    Step 6 తర్వాత క్యాప్సికం ముక్కలు, వేరుసెనగ పప్పులతో చేసిన మిశ్రమం చేర్చి బాగా చిక్కబడే వరకు నూనెలోనే మగ్గనివ్వాలి.   Step 7 అనంతరం కారం పొడి, ధనియాల పొడి వేసి కలిపి కొంచెం నీళ్ళు చల్లి పది నిముషాలు ఉడికించాలి.    Step 8 చివరగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను గ్రేవీలో వేసి రెండు నిముషాలు ఉడికించాలి.    Step 9 అంతే ఘుమఘుమలాడే క్యాప్సికం పన్నీర్ కుర్మా రెడీ. దీనిని అన్నం లేదా చపాతితో ఆరగించవచ్చు.       
Yummy Food Recipes
Add