Sweet pumpkin curry recipe By , 2017-05-04 Sweet pumpkin curry recipe Here is the process for Sweet pumpkin curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుమ్మడి కాయ ముక్కలు : 3 కప్పులు (చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి),టమోటా ముక్కలు : 1 కప్పు,ఉల్లిపాయలు : 2 (తరిగి పెట్టుకోవాలి),బెల్లం కోరు : 1 కప్పు,ఎండు మిరపకాయలు : 2,పచ్చిమిరపకాయలు : తగినన్ని,కారం పొడి : అరచెంచా,ధనియాల పొడి : అరచెంచా,ఆవాలు : అరచెంచా,జీలకర్ర : అరచెంచా,మినపప్పు : అరచెంచా,కొత్తిమీర : కొద్దిగా,కరివేపాకు : కొద్దిగా, Instructions: Step 1 ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి.  Step 2 వేడి అయ్యాక కొన్ని ఆవాలు వేసి చిటపటలాడక జీలకర్ర, తుంపిన ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. Step 3 తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలిపి దోరగా వేయించుకోవాలి.  Step 4 వేగిన ఉల్లిపాయలకు, గుమ్మడి ముక్కలు, టమోటా ముక్కలు, చిటికెడు పసుపు కలపాలి.    Step 5 తగినంత ఉప్పు వేసి పదిహేను నిముషాలు సన్నని సెగపై ఉడకనిచ్చాక కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలపాలి.    Step 6 ఇప్పుడు అరకప్పు నీరు పోసి ముక్కలు ఉడికే అంత వరకు సన్నని సెగపై ఉంచాలి. కూర దించుకున్నాక కొత్తిమీర చల్లి వడ్డించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day