Ravva Idli Recipe By , 2016-10-24 Ravva Idli Recipe rava idli or instant rava idli recipe Prep Time: 15min Cook time: 20min Ingredients: ఉప్మా రవ్వ - 1 కప్పు,పెరుగు - 1 కప్పు,ఉప్పు - తగినంత,క్యారట్(తురిమినది) - 1 టేబుల్‌స్పూన్,ఉల్లిపాయలు(సన్నగా తరిగినవి) - 1/2 కప్పు,అల్లం(సన్నగా తరిగినవి) - 1 టేబుల్‌స్పూన్,ఆవాలు,పచ్చి శెనగపప్పు,నూనె,నీళ్ళు, Instructions: ముందుగ పాన్‌లో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి. అది కాస్త వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి మరికాసేపు వేయించాలి. వేగిన ఉప్మా రవ్వను ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి. మామూలుగా తయారు చేసే ఇడ్లీ పిండి లాగే తయారు చేసుకోవాలి. అందులో క్యారట్ ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అర్ధ గంట పాటు నాన పెట్టాలి. వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి. అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడితో తింటే చాలా బావుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day