Home made chicken roll recipe By , 2017-04-22 Home made chicken roll recipe Here is the process for Home made chicken roll making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చపాతీలు: 4,ఉల్లిపాయలు: 1,క్యాప్సికమ్: 1,క్యారెట్ : 1,టమోటో: 1,నిమ్మకాయ: 1,మయోనైజ్: తగినంత,చికెన్ ఫిల్లింగ్ కోసం,బోన్ లెస్ చికెన్: 150grm,- ఉల్లిపాయ:1,పచ్చిమిర్చి: 3-4,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp,ధనియాలపొడి: 1tsp,చికెన్ మసాలా పొడి: 1tsp,జీలకర్రపొడి: 1/2tsp,షాజీరా : చిటికెడు,కారం: 1tsp,ఉప్పు: రుచికి సరిపడా,కరివేపాకు, కొత్తిమీర, పుదీనా : 2tbsp సన్నగా తరిగి పెట్టుకోవాలి,నూనె: 2tbsp, Instructions: Step 1 ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో షాజీరా, పుదీనా, ఉల్లిపాయ, కరివేపాకు, వేసి ఒక నిముషం వేగించుకోవాలి. Step 2 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి. Step 3 ఇందులో ముందుగానే పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బోన్ లెస్ చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిముషాలు మగ్గించాలి. Step 4 మగ్గిన చికెన్ లో ధనియాల పొడి, జీలకర్ర, చికెన్ మసాలా, కారం, ఉప్పు, వరుసగా వేస్తూ కలిపి మళ్ళీ మూతపెట్టి మరొక 10 నిముషాల వరకూ కర్రీని ఉడికించుకోవాలి. Step 5 కర్రీ దగ్గర పడుతున్నప్పుడు, మూత తీసి కలియబెడుతుండాలి. 5 నిముషాల తర్వాత వేయించితే చికెన్ స్టఫింగ్ రెడీ అయినట్లే.. Step 6 ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ లను సన్నగా తరిగి, నిమ్మరసం పిండి సలాడ్ లాగా రెడీ చేసి పెట్టాలి. Step 7 ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకొన్న చపాతీల మీద మయోనైజ్ అప్లై చేయాలి. Step 8 చపాతీ మొత్తం మయోజైజ్ అప్లై చేసిన తర్వాత చపాతీల మీద కూరగాయల ముక్కలు పెట్టాలి. Step 9 వీటి మీద ముందుగా తయారుచేసుకొన్న చికెన్ స్టఫ్ పెట్టాలి. అలాగే చికెన్ స్టఫ్ మీద తిరిగి వెజిటేబుల్ ముక్కలు వేసి స్టఫ్ చేయాలి. Step 10 చివరగా టమోటో సాస్ వేసి చపాతీని రోల్ చేస్తే సరి హోం మేడ్ చికెన్ రోల్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day