Aloo Soup recipe By , 2017-04-05 Aloo Soup recipe Here is the process for Aloo Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆలు (పొట్టుతీసి, ముక్కలు కోసి)- మూడు,,పెద్ద ఉల్లిపాయ (తరిగి)- ఒకటి,,పచ్చిమిర్చి (నిలువుగా కోసి) - ఐదు,,అల్లం (సన్నగా తరిగి) - చిన్న ముక్క,,చిక్కటి కొబ్బరి పాలు - ఒక కప్పు,,పలుచటి కొబ్బరి పాలు - ఒక కప్పు,,నీళ్లు - సరిపడా,,కరివేపాకు రెబ్బలు - రెండు,,ఉప్పు - సరిపడా,,కొబ్బరి నూనె - ఒక టేబుల్ స్పూన్., Instructions: Step 1 పలుచటి కొబ్బరి పాలను కుక్కర్లో పోసి అందులో బంగాళాదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి.  Step 2 ఉప్పు వేసి, నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తరువాత మూత తెరిచి మంట తగ్గించి చిక్కటి కొబ్బరి పాలు పోయాలి.  Step 3 రెండు నిమిషాలు ఉడికిన తరువాత కొబ్బరి నూనె, కరివేపాకులు వేసి స్టవ్ ఆపేయాలి.  Step 4 కుక్కర్ మీద మూత కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచితే నూనె, కరివేపాకుల సువాసనలు సూప్లోకి ఇంకి కమ్మటి వాసన వస్తుంది. Step 5 ఈ సూప్ను ఆపం లేదా ఇడియాపంతో తీసుకుంటారు. శాండ్విచ్ బ్రెడ్, చపాతి, పూరి, అన్నంతో పాటు తీసుకున్నా బాగానే ఉంటుంది. Step 6 వేగించిన బ్రెడ్ క్రంబ్స్తో కూడా రుచిగా ఉంటుంది. కారంగా కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు.   Step 7 క్యారెట్, పచ్చి బఠాణీ, కాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలను వేసుకుంటే ఇదే మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అవుతుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day