carrot ravva idly recipe By , 2017-03-18 carrot ravva idly recipe Here is the process for carrot ravva idly making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ -1 కప్పు ,,క్యారెట్ -2,,పచ్చిమిర్చి -2,,అల్లం- 1 ఇంచ్ ,,వంటసోడా -1/4 టీస్పూన్,,పుల్లటి పెరుగు -1/2 కప్పు ,,నీళ్లు -1/2 కప్పు ,,జీడిపప్పు -10,,పచ్చిపప్పు -1 టీస్పూన్ ,,మినపప్పు -1/2 టీస్పూన్ ,,ఎండుమిర్చి -1,,నెయ్యి /నూనె-2 టేబుల్ స్పూన్లు ,,ఆవాలు -1/4 టీస్పూన్ ,,జీలకర్ర -1/2 టీస్పూన్,,కర్వేపాకు -1 రెమ్మ,,ఉప్పు -తాగింత(1/2 టీస్పూన్)., Instructions: Step 1 ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసుకోవాలి. Step 2 అది వేడి ఎక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర ,పచ్చిపప్పు, మినపప్పు ,జీడిపప్పు పలుకులు ,కరివేపాకు మరియు ఎండుమిర్చి వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి , తురిమిన క్యారెట్, ఉప్పు మరియు అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం వేపుకోవాలి. Step 3 తర్వాత రవ్వ వేసి మరో నిమిషం వేపి చల్లారనివ్వాలి. పెరుగు,సోడా మరియు నీళ్లు పోసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి . Step 4 తర్వాత ఇడ్లి పాత్రలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇడ్లీ ప్లాట్లకి నెయ్యి రాసి పిండి వేసి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. Step 5 ఇడ్లీ ఉడికిందో లేదో చూసి పాత్రని పక్కన పెట్టుకోవాలి. రవ్వ ఇడ్లీని కొబ్బరి చట్నీ, సాంబార్ లేక ఏదైనా రోటి పచ్చడితో రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day