Palli chat recipe By , 2017-03-07 Palli chat recipe Here is the process for Palli chat making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పల్లీలు - కప్పు;,అటుకులు - రెండు కప్పులు;,స్వీట్ కార్న్ - కప్పు;,పుట్నాలపప్పు - అరకప్పు;,ఉల్లితరుగు - అరకప్పు,సన్నగా తరిగిన టొమాటోలు - పావు కప్పు;,నిమ్మరసం - రెండు టీ స్పూన్లు;,ఉప్పు - తగినంత;,పచ్చిమిర్చి - 2;,ఇంగువ -కొద్దిగా;,పసుపు - కొద్దిగా;,మిరప్పొడి - కొద్దిగా;,నూనె - తగినంత;,కరివేపాకు - రెండు రెమ్మలు;,కొత్తిమీర తరుగు - టీ స్పూను, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నూనె కాగాక అందులో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. Step 2 తరవాత, అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి పుట్నాలపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 మళ్లీ అదే బాణలిలో మరికాస్త నూనె వేసి అందులో కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వేసి అందులో అటుకులు కూడా వేసి గుల్లగా వేయించుకోవాలి. Step 4 మరో పెద్ద పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించి ఉంచుకున్న పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి. Step 5 మిరప్పొడి వేసి మరోమారు కలిపిన తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. Step 6 చివరగా స్వీట్‌కార్న్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే తినేయాలి. లేదంటే మెత్తపడిపోతాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day