Kova badusha By , 2017-03-02 Kova badusha Here is the process for Kova badusha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కోవా: 1/2 kg,మైదా: 50 grm,పంచదార: 1/2 kg,సోడా: చిటికెడు,యోగర్ట్: 1 cup,యాలకుల పొడి: 1/2 tsp,నెయ్యి: 2 tbsp,ఆయిల్: తగినంత, Instructions: Step 1 ఒక బౌల్ లోకి జల్లించిన మైదా, సోడా, రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి, నెయ్యి మరియు యోగర్ట్, కోవావేసి మెత్తగా చపాతి ముద్ద కంటే మరికొద్ది సాప్ట్ గా కలుపుకోవాలి. అవసరమనుకొంటే కొద్దిగా నీరు జత చేయవచ్చు. Step 2 ఇలా తయారు చేసిపెట్టుకొన్న ముద్దను ఒక అరగంట సేపు అలాగే నాననివ్వాలి. Step 3 తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఒక కప్పు వేడినీటిలో మిగిలిన పంచదారను వేసి పాకంను సిద్ద చేసుకోవాలి. పంచదార పాకం తయారైయ్యే సమయంలో యాలకల పొడి వేసి కలియబెట్టి స్టౌ ఆఫ్ చేసి ప్రక్కన తీసి పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు మొదటగా తయారు చేసి పెట్టుకొన్న మైదా ముద్ద నుండి నిమ్మపండు సైజులో కొద్ది కొద్దితా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టి నాలుగు వేళ్ళతో వత్తుకోవాలి. Step 5 స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక, సిద్ద చేసిపెట్టుకొన్న బాదుషాలను అందులో వేసి తక్కువ మంట మీద దోరగా వేగనివ్వాలి అప్పుడే లోపలి బాగం కూడా బాగా కాలివుంటుంది. Step 6 ఇలా తయారైన బాదుషాలను పంచదార పాకంలో వేసి బాగా నాననివ్వాలి. కొద్దిసేపు నానినతర్వాత వాటిని పంచదార పకం నుండి వేరు చేసి బాగా చల్లారనివ్వాలి. Step 7 చల్లారిన బాదుషాలపై(మద్యలో) ఎండిన పంచదార పాకంను వేసి గార్నిష్ గా అలంకరించుకోవాలి. అంతే రుచికరమైన కోవా బాదుషాలు రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day