Egg Parata recipe By , 2017-02-27 Egg Parata recipe Here is the process for Egg Parata making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గుడ్లు - నాలుగు(ఉడికించినవి),బంగాళాదుంపలు - మూడు,(ఉడికించినవి),గోధుమపిండి - అరకిలో,మైదా - పావుకిలో,అరటిపళ్లు - రెండు,అల్లం,పచ్చిమిర్చి,ఉప్పు, కారం..., కొత్తిమీర,అన్నీ తగినంత, Instructions: Step 1 గోధుమపిండి, మైదాపిండి కాస్త వెచ్చటి నూనె, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపాలి. Step 2 ఈ పిండి కలిపేటప్పుడే అరటిపళ్లు చిన్న చిన్న ముక్కలుగా వేసి, అందులో కలిపాలి. Step 3 పిండి, పళ్లు బాగా కలిసేటట్టు చేయాలి. ఆ పిండిని తడి క్లాత్ చుట్టి పక్కన వుంచాలి. Step 4 అల్లం, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొత్తిమీర, చిటికెడు కారం వేసి చితకబతకగా దంచాలి. Step 5 ఆ మిశ్రమాన్ని, ఉడికిన బంగాళాదుంపలు చిదిపి, ఉడికిన గుడ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి, అన్నింటినీ కలిపి మసాలా ముద్దలా తయారు చేయాలి. Step 6 దీనికి తగినంత ఉప్పు కలపాలి. ఆపై గోధుమ,మైదా పిండి మిశ్రమాన్ని మీడియం సైజు ఉండలుగా చేయాలి. Step 7 ఉండను చిన్నగా వత్తి మధ్యలో ఆలు-ఎగ్ మిశ్రమం వుంచాలి. నాలుగువైపులా మూసి, మళ్లీ ఉండలా చేయాలి. Step 8 ఇప్పుడు దాన్ని చేత్తోనే చపాతీలా నెమ్మదిగా తయారచేయాలి. నూనె లేదా నెయ్యివేసి దోశపెనంపై ఎర్రగా కాల్చాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day