cajun-prawns recipe By , 2017-02-14 cajun-prawns recipe Here is the process for cajun-prawns making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రొయ్యలు(పెద్ద సైజువి): అరకిలో,,రిఫైండ్‌ ఆయిల్‌: తగినంత,,నీళ్లు: 2 కప్పులు,,కార్న్‌ఫ్లోర్‌: 2 టీస్పూన్లు,,మైదా: టీస్పూను,,కోడిగుడ్డు: ఒకటి,,ఉల్లికాడల తురుము:,కప్పు, కొత్తిమీర తురుము:,అరకప్పు, క్యారెట్‌ తురుము:,అరకప్పు, బీన్స్‌(సన్నగా తరగాలి):,అరకప్పు, పచ్చిమిర్చి: 4(సన్నముక్కలుగా కోయాలి),,టొమాటో కెచప్‌: 2 టేబుల్‌స్పూన్లు,,అల్లం-వెల్లుల్లి ముద్ద: టీస్పూను,,గ్రీన్‌ చిల్లీ సాస్‌: టీస్పూను,,కారం: అరటీస్పూను,,మిరియాలపొడి: పావుటీస్పూను,,ఉప్పు: తగినంత, Instructions: Step 1 ఓ గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలు వేసి కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్‌, మైదా, అల్లం-వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి అవరసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి మిశ్రమం రొయ్యలకు పట్టేలా కలపాలి. ఇప్పుడు వీటిని నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించి తీయాలి. Step 2 సన్నగా తరిగిన క్యారెట్‌, బీన్స్‌ ముక్కల్ని సగం ఉడికించి చల్లార్చాలి. Step 3 కళాయిలో 2 టేబుల్‌స్పూన్లు నూనె పోసి కాగాక ఉల్లికాడలు, పచ్చిమిర్చి తురుముల్ని వేసి దోరగా వేయించాలి. Step 4 తరవాత గ్రీన్‌ చిల్లీ సాస్‌, టొమాటో కెచప్‌, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. 2 కప్పుల నీళ్ళు పోసి వేయించిన రొయ్యల్ని వేయాలి. కొత్తిమీర తురుము, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు వేసి మీడియం సెగమీద వేయించి దించాలి.  
Yummy Food Recipes
Add