Vankaya pachadi Recipe By , 2017-02-11 Vankaya pachadi Recipe Here is the process for Vankaya pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు పెద్దవి - 4,నూనె - 6 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 10,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,నానబెట్టిన చింతపండు - కొద్దిగా,కొత్తిమీర - కొద్దిగా,ఆవాలు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,శనగపప్పు - టీ స్పూను,ఎండుమిర్చి - 10,ఉల్లితరుగు - అర కప్పు,కరివేపాకు - రెండు రెమ్మలు,నువ్వులపొడి - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి.చల్లారిన తరవాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి. పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. Step 2 వంకాయ గుజ్జును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒక్కటొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలో కలపాలి.ఉల్లితరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి.సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add