Nune Vankay Kura By , 2017-01-27 Nune Vankay Kura Here is the process for Nune Vankay Kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉల్లిపాయలు 1/4 కిలో,టమోటాలు 1/4 కిలొ,గుత్తి వంకాయలు 1/2 కిలో,శనగ గుండ్లు 1/2 కప్పు,పచ్చి పప్పు 1/4 కప్పు,ధనియాలు 1/4 కప్పు,పుట్నాల పప్పు 1/4 కప్పు,ఎండు మిర్చి 6 కాయలు,ఉప్పు తగినంత,నువ్వులు 1/4 కప్పు,నూనె 1/4 కప్పు,పోపు గింజలు తగినన్ని,పసుపు 1 టీస్పూన్,కొత్తిమీర 2 చిన్న కట్టలు, Instructions: Step 1 ముందుగా కూరలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 3 వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి(గుత్తి వంకాయల్లాగానే). Step 4 ఇప్పుడు శనగపలుకులు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులు ఒక బాణెలిలో వేయించుకోవాలి. Step 5 దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. Step 6 ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. Step 7 నూనె కాగాక ,పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. Step 8 ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి, వంకాయలు ఉడికి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. Step 9 తర్వాత ఇందాక పక్కన పెట్టిన పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day