Mashroom Manchuria By , 2016-11-26 Mashroom Manchuria Here is the process for Mashroom Manchuria. Just follow this simple steps and make delicious Mashroom Manchuria. Prep Time: 25min Cook time: 25min Ingredients: బటన్‌ మష్రూమ్స్‌ – పావుకేజీ,మైదా – ముప్పావుకప్పు,మొక్కజొన్నపిండి – పావుకప్పు,కారం – అరచెంచా,వెల్లుల్లి తరుగు – చెంచా,ఉప్పు – తగినంత,నీళ్లు – పిండి కలిపేందుకు,నూనె – వేయించేందుకు సరిపడామంచూరిమా మసాలా తయారీకి కావలసిన పదార్దాలు:,నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,అల్లం,వెల్లుల్లి తరుగు – అరటేబుల్‌స్పూను చొప్పున,క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున,సోయా సాస్‌ – రెండు టేబుల్‌స్పూన్లు,చిల్లీసాస్‌ – టేబుల్‌స్పూను,కారం – అరచెంచా,మిరియాలపొడి – పావుచెంచా,ఉప్పు – తగినంత, Instructions: Step 1 పుట్టగొడుగుల్ని కడిగి, తుడిచి పెట్టుకోవాలి. Step 2 పిండికోసం తీసుకున్న పదార్థాల్లో నూనె తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమం దోశపిండిలా ఉండాలి. Step 3 ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. Step 4 ఒక్కో పుట్టగొడుగును తీసుకుని ఈ పిండిలో ముంచి, కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసుకోవాలి. Step 5 ఇప్పుడు మంచూరియా మసాలా తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. Step 6 అది వేడయ్యాక ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేయాలి. Step 7 రెండు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి తరుగు వేయాలి. Step 8 అవి కాస్త వేగాయనుకున్నాక కారం, సోయా, చిల్లీసాస్‌, కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడి వేసి పెద్దమంటపై వేయించాలి. Step 9 ఇందులో ముందుగా వేయించుకున్న పుట్టగొడుగు ముక్కల్ని వేసి బాగా కలిపి దింపేసి ఉల్లికాడల తరుగు వేస్తే చాలు.
Yummy Food Recipes
Add