atukula samosa recipe By , 2016-11-29 atukula samosa recipe Here is the making process for atukula samosa. Just follow the simple tips and cook mouth watering atukula samosa. Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా – ఒకటిన్నర కప్పు,ఉప్పు – కొద్దిగా,నిమ్మరసం – ఒకటిన్నర చెంచా,నూనె- వేయించేందుకు సరిపడాఫిల్లింగ్‌ కోసం: ,ఉల్లిపాయ – ఒకటి పెద్దది,కారం- అరచెంచా,అటుకులు- అరకప్పు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి),కొత్తిమీర-ఒకకట్ట,ఉప్పు-తగినంత., Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, తగినంత ఉప్పు, నిమ్మరసం తీసుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ.. చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. Step 2 దానిపై తడి వస్త్రాన్ని కప్పి కాసేపు నాననివ్వాలి. Step 3 ఇంతలో పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. Step 4 అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక కొద్దిగా ఉప్పూ, కారం వేసి పొయ్యి కట్టేయాలి. Step 5 ఆ వెంటనే మరీ అటుకుల మిశ్రమం, కొత్తిమీర తరుగు వేయాలి. అన్నింటినీ బాగా కలిపితే కూర తయారైనట్లే. Step 6 నానిన మైదా మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని చిన్న చపాతీలా వత్తి పెనంపై ఓ అరనిమిషం కాల్చుకుని తీసుకోవాలి. Step 7 ఆ చపాతీని తీసుకుని మధ్యలో చెంచా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి.. సమోసాలా వచ్చేలా అంచుల్ని చుట్టి మూసేయాలి. Step 8 దీన్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే చాలు.
Yummy Food Recipes
Add